జెండర్ గాప్
ప్రపంచ ఆర్థిక వేదిక(WEF) విడుదల చేసిన నివేదిక ప్రకారం స్త్రీ పురుష సమానత్వం లో అంటే జెండర్ గాప్ లో మన దేశం చాలా వెనుకబడి ఉంది. అంటే స్త్రీ ని చాలా తక్కువ చేస్తున్నారు అని అర్ధం. ఈ సంస్థ 156 దేశాల నుండి సేకరించిన సమాచారం ప్రకారం మన దేశం 140 వ స్థానం లో నిలిచింది. అంటే ఆడవాళ్ళని బాగా చూసుకుని, సమానావకాశాలు కల్పించిన దేశం కు మొదటి స్థానం ఇస్తారు. అలా మనం 156 దేశాలలో 140 వ ర్యాంకు వచ్చినది. కాకపోతే బాలిక విద్య లొ కొద్దిగా పురోగతి ఉన్నదట. అలాగని చెప్పుకోతగ్గ స్థాయిలో పెరగలేదుట. అలాగే మన దేశంలో ప్రతి నలుగురు మహిళల్లో ఒకరు తమకు బాగా తెలిసిన వారి చేత వేధింపులు కు గురి అవుతున్నారట. అలాగే మానవ హక్కుల విషయంలో, ఆకలి సూచి విషయంలో కూడా చాలా వెనుకబడి ఉన్నాము. ఇలాగే దీర్ఘకాలం కొనసాగితే దేశం, రాష్ట్రం పురోగమించడం సాధ్యపడదు. చదువులో, ఉపాధి కల్పనలో , వైద్య ఆరోగ్య సేవల విషయంలో ఇలా అన్నింటా మహిళకు ప్రాధాన్యత ఇవ్వాలి.సామజిక, ఆర్ధిక, రాజకీయాలు లో మహిళల పాత్ర పెరగాలి. చట్ట సభలో 33 శాతం మహిళలకు రిజర్వేషన్ అమలు చేయాలి. కానీ మన దేశంలో ఆచార, సంప్రదాయాలు మహిళలను సాధ్యమైనంత వరకు మగ వారి వెనకే ఉండమని చెబుతాయి. వాటిని రూపుమాపి కాలమాన పరిస్థితుల ప్రకారం ప్రభుత్వాలు మహిళలను ముందుకు తీసుకువెళ్ళమని ఐక్యరాజ్య సమితి తరచూ చెబుతున్నది. అందుకు విరుద్ధంగా మన దేశ పాలకులు మాత్రం స్త్రీలకు గౌరవం ఇవ్వడం లేదు. అందుకు ఉదాహరణ నిర్భయ చట్ట నిధులు తగినంత ఇవ్వకపోవడం, అత్యాచార నేరస్థులు కు వెంటనే శిక్షలు వేయకపోవడం, విద్యకు, ఆరోగ్యానికి బడ్జెట్ చాలా తక్కువ కేటాయించడం, మగ పిల్లవాడు ఉంటేనే కుటుంబానికి గౌరవం అనే భావన నాటుకుపోవడం మొదలైన కారణాలతో మన దేశం లో స్త్రీలు పురుషుల కన్నా వెనుకబడి ఉన్నారనేది ఇపుడు నిరూపితమైనది. ఇవన్నీ సరిదిద్దు కుంటేనే మన దేశం అంతర్జాతీయంగా గౌరవం పొంద గలదు. మాది హిందూదేశం అని గొప్పగా చెప్పే మన వారి ఆస్థాన ఆర్ధిక గురువు చాణిక్యుడే అంటాడు ఏమని అంటే దేశం లో ఏ ఒక్క రంగంలో సంక్షోభం వచ్చినా అది దేశం మొత్తానికి నష్టం చూపిస్తుంది అని. కాబట్టి పాలకులు తమ ప్రస్తుత పురుషాధిపత్య విధానాలు విడనాడి మహిళల అభివృద్ధి కి తోడ్పడాలి. (02-04-2021 ప్రజాశక్తి ఎడిటోరియల్ "అన్నింటా దిగజారుడు"సౌజన్యంతో)
.. Nanduri Padmanjali, Advocate, Nuzvid.
Comments
Post a Comment