మార్టిన్ లూధర్ కింగ్







మార్టిన్ లూధర్ కింగ్ నల్లజాతి ప్రజలైన నీగ్రోలపై తెల్లజాతి ప్రజల వర్ణ వివక్షకు వ్యతిరేకంగా మానవ హక్కులు కోసం పోరాటం చేసిన అమెరికా నల్లజాతి నీగ్రో ప్రజల నాయకుడు.మార్టిన్ లూధర్ కింగ్ అట్లాంటా లోని జార్జియా లో జనవరి 15 వ తేదీన 1929 సంవత్సరం లో జన్మించారు. మార్టిన్ లూధర్ కింగ్ తల్లిదండ్రులు రెవరెండ్.మార్టిన్ లూధర్ కింగ్ సీనియర్ -ఆల్బర్టా విలియమ్స్ కింగ్ లు.

   మార్టిన్ లూధర్ కింగ్ కు తన తండ్రి తొలుత పెట్టిన పేరు మైకేల్ లూధర్ కింగ్.ప్రొటెస్టంట్ మత విప్లవ నాయకుడు మార్టిన్ లూధర్ కింగ్ ను ఆదర్శంగా తీసుకున్న మైకేల్ లూధర్ తండ్రి తన తనయుడికి అతని పేరునే పెట్టడం జరిగింది.అలా మైకేల్ పేరు ను తన ఆరవ ఏటనే మార్టిన్ లూధర్ కింగ్ గా మార్చడం జరిగింది. మార్టిన్ లూధర్ కింగ్ ను తోరో వ్రాసిన "సివిల్ డిసో బిడియన్స్" పుస్తకం బాగా ప్రభావితం చేసింది.ఇక అప్పటి నుండి కింగ్ చర్చ్ కేంద్రం గా పనిచేయాలని నిర్ణయం తీసుకున్నారు.మార్టిన్ లూధర్ కింగ్ చదువులో చురుకుగా ఉండేవారు.1948 లో సామాజిక శాస్త్రం లో డిగ్రీ చదివారు.బోస్టన్ యూనివర్సిటీ లో డాక్టరేట్ చేశారు.కోరెట్టాస్కాట్ ను పరిణయం చేసుకున్న మార్టిన్ లూధర్ కింగ్ సమానత్వపు విలువలు కోసం తపించారు. క్రైస్తవ మతాచార్యునిగా సేవలు అందించారు.సమానత్వం, మానవీయ హక్కులు కోసం ప్రజలను చైతన్యపరిచారు.అమెరికా-ఆఫ్రికా నల్లజాతీయ నీగ్రోల పట్ల అమెరికా శ్వేత వర్ణ ప్రజలు వివక్ష పాటించారు. ఈ వివక్ష కు వ్యతిరేకంగా క్రైస్తవ మతాచార్యునిగా ఉంటూ చర్చ్ కేంద్రం గా పోరాటం సాగించిన తీరును మతం మత్తులో ఉంటూ పరలోకం కోసం ఆలోచన చేస్తూ ఇహలోకంలో జరుగుతున్న అమానుషం,స్వార్థ పరతపై నిమ్మకునీరెత్తినట్లు ఉంటున్నవారు ప్రేరణ పొందాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మతం మనిషి కోసం కానీ మనిషి కోసం మతం కారాదు.మనకు మతం జోకొట్టేలా ఉండరాదు. మతం మనిషి లో మానవత్వాన్ని, సమానత్వపు విలువలను ,దయను ,సాటిమనిషి ఆపదలో ఉంటే రక్షించడాన్ని ,నిస్వార్థ సేవను అలవరచాలి తప్ప ఉన్మాదాన్ని కానీ, దేవుడు, పరలోకం అంటూ సమయాన్ని ప్రార్థనలు పేరుతో వృథా పరచరాదు.మార్టిన్ లూధర్ కింగ్ మతాన్ని సరిగ్గా ఆచరించిన గొప్ప వ్యక్తి.మతం తనలో సమానత్వపు విలువలు కోసం, కోల్పోయిన హక్కులు కోసం, వర్ణ జాత్య అహంకారానికి వ్యతిరేకంగా ఆందోళనలు, పోరాటాలు చేయడం నేర్పింది. సమానత్వాన్ని సాధించడం నేర్పింది. సేవ చేయడం నేర్పింది. ఇది మనం గుర్తించాలి.*
   అమెరికాలో ఆఫ్రికన్ నల్లజాతి నీగ్రోల పట్ల అమెరికన్ శ్వేతజాతీయులు వివక్ష ను చూపేవారు.పరిశ్రమలలో పనిచేసే చోట అమెరికన్లు ఆఫ్రికన్లుతో కలిసి భోజనం చేయడానికి సిద్ధంగా ఉండేవారు కాదు.బస్సులలో సైతం ఆఫ్రికన్ లతో కలిసి ప్రయాణం సాగించడానికి వర్ణ వివక్ష కారణంగా సిద్ధంగా ఉండేవారు కాదు. తీవ్రమైన వర్ణ వివక్షను అమెరికన్లు కలిగి ఉండేవారు.ఈ దురాచారానికి వ్యతిరేకంగా మానవ హక్కులు కోసం, సమానత్వం కోసం మార్టిన్ లూధర్ కింగ్ పౌర హక్కుల ఉద్యమాన్ని 1955 లో నడిపారు.నల్లజాతి ప్రజలు బస్సులలో ప్రయాణం చేయడం మానివేశారు.సుమారు 40 బిలియన్ డాలర్ల నష్టం తెల్లజాతి వారికి, ప్రభుత్వానికి వచ్చింది. దీంతో ప్రభుత్వం దిగి వచ్చి సమాన హక్కులు కల్పించింది.మాంటిగోరి బస్సు నిరసన ఉద్యమంగా అది చరిత్రలో నిలిచింది.ఇక అక్కడితో మాత్రమే వీరి ఉద్యమం సరిపెట్టుకోలేదు.అమెరికాలో నల్లజాతి నీగ్రోలకు ఓటు హక్కు ఇవ్వరాదు అంటూ ఒక వార్తాపత్రిక ప్రచురించడంతో , తమకు అందరితో సమానంగా ఓటు హక్కు ఎందుకు కల్పించరు అంటూ మార్టిన్ లూధర్ కింగ్ నాయకత్వం లో అమెరికాలో పెద్ద ఎత్తున ఉద్యమం నడిచింది.ఈ ఉద్యమం రాజకీయంగా ఎదిగితే ఎక్కడ ఆధిపత్య జాత్యహంకార శ్వేతజాతీయులు తమ పట్టును కోల్పోతారో అని వాళ్ళ వెన్నులో వణుకు మొదలైంది.
1957 లో మార్టిన్ లూధర్ కింగ్ సదరన్ లీడర్ షిప్ కాన్ఫరెన్స్ (ఎస్ సి ఎల్ సి)అనే ఒక సంస్థను నెలకొల్పారు.కింగ్ గొప్ప వక్త కావడంతో అనతికాలంలోనే నల్లజాతి నీగ్రోల నాయకుడుగా ఎదిగారు. మతపరమైన కోణంలోనే అహింసా విధానాలను వ్యతిరేకించారు.*
   *1963 లో మార్టిన్ లూధర్ కింగ్ నాయకత్వం లో  బర్మింగ్ హామ్ లో మానవ హక్కులు కోసం సాగించిన పోరాటంలో లక్షలాది మంది పాల్గొన్నారు.ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు.దీంతో ప్రభుత్వం దమనకాండను ప్రదర్శించడంతో 2500 మంది ఈ ఉద్యమం లో బలైపోయారు.ప్రభుత్వం మార్టిన్ లూధర్ కింగ్ ను జైలుపాలు చేసింది.ఈ సమయంలో కింగ్ నల్లజాతి ప్రజల కోసం పోరాడుతున్న మరొక సంస్థతో కలిసి ఉద్యమాన్ని తీవ్రతరం చేసారు.ఈ సమయంలో అమెరికా కెన్నడీ ప్రభుత్వం మానవ హక్కులు కోసం మాత్రమే మీ ఉద్యమాన్ని పరిమితం చేస్తే మంచిది దీన్ని రాజకీయ పరంగా చేయవద్దని హెచ్చరించారు.1965 లో వియత్నాం యుద్ధం జరగడం తో కెన్నడీ ప్రభుత్వానికి - మార్టిన్ కు మధ్య తీవ్రంగా పోరాటం నడిచింది.మోసపూరిత రాజకీయాలకు వ్యతిరేకంగా కింగ్ తన పోరాటం కేవలం వర్ణ వివక్షకు మాత్రమే వ్యతిరేకంగా కాకుండా పేదరికాన్ని నిర్మూలన చేయాల్సిన ఆవశ్యకతను గమనించారు.శ్వేత జాతి ప్రజలలో కూడా పేదలు ఉన్నారు అని నల్లజాతి వారిని శ్వేత జాతి వారిని ఐక్యం చేసారు.1967 లో కింగ్ టీంస్టెర్స్ లో షెపర్డ్స్ (గొర్రెల కొపరులను) ను ఉద్ధేశించి ఇలా మాట్లాడారు " దేశంలో పేదలు నల్లజాతి వారే కాదు తెల్ల జాతి వారు కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు.పేదరికం పై పోరాటం వర్ణ వివక్షకు సంబంధించిన పోరాటం కాదు.ఆర్థిక న్యాయం కోసం జరుగుతున్న ఉద్యమం."
  1968 లో కింగ్ పేదల ఉద్యమాన్ని నడిపారు.నల్లజాతి, తెల్లజాతి వారితో ఛలో వాషింగ్టన్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు."దోపిడీ దారులు మనకు దయతో హక్కులు ఇవ్వరు.దోపిడీకి గురవుతున్న ప్రజలంతా పోరాటం చేసి మన హక్కులు మనం సాధించుకోవాలి" అని కింగ్ పిలుపునిచ్చారు.తెల్లజాతి, నల్లజాతి ప్రజలను ఐక్యం చేయడం చూసి ఓర్వలేని జాత్యహంకార తెల్లజాతి వారు మార్టిన్ లూధర్ కింగ్ ను హతమార్చడం కోసం ప్రయత్నం చేశారు.ప్రపంచంలోని మానవులు అందరూ జాతి ,వర్ణ బేధాలు లేకుండా అరమరికలు లేకుండా స్వేచ్ఛగా, సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని కలిగి ఉంటూ జీవించాలని "ఐ హేవ్ ఎ డ్రీమ్" అన్న కింగ్  ఒక దుండగుడు పేల్చిన తుపాకీ తూటాకు బలైపోయారు.1968 ఏప్రిల్ 4 న పారిశుద్ధ్య కార్మికులను ఉద్ధేశించి మార్టిన్ లూధర్ కింగ్ ప్రసంగిస్తుండగా దారుణంగా ఆయణ్ణి హత్య చేశారు.*

*మార్టిన్ లూధర్ కింగ్ కు 1964 లో తన 35 వ ఏట నోబెల్ శాంతి బహుమతి లభించింది. తన పట్టుదల, నిబద్ధతకు ,నాయకత్వ లక్షణాలకు లభించిన గొప్ప బహుమతి ఇది.నోబెల్ బహుమతి అందుకున్న సందర్భంగా కింగ్ ఇలా మాట్లాడారు "ఏదో ఒకరోజు ప్రపంచం యుద్ధానికి బదులు శాంతిని కోరుకుంటుంది.రక్తానికి బదులు ప్రేమ, సౌభ్రాతృత్వం వెల్లివిరుస్తాయని నమ్మడానికి నేను సాహసిస్తున్నాను.ఆ మంచి రోజుకీ మనకీ మధ్య ఎన్నో ఆటంకాలు, అవరోధాలు ఉన్నాయి.వాటిని అన్నింటినీ నేను అధిగమించి తీరుతాను."*

*అబ్రహం లింకన్ 1863 జనవరి 1 తేదీ నుండి బానిసలు అందరికీ, అందరితో పాటు నల్లజాతి ప్రజలకు సమాన హక్కులు,సంపూర్ణ అవకాశాలు కల్పిస్తున్నానని ప్రకటన చేయడం జరిగింది. సరిగ్గా 100 సంవత్సరాలకు మార్టిన్ లూధర్ కింగ్ జనవరి 1 నాటికి తెల్లజాతి వారితో పాటు నల్లజాతి వారికి సమాన అవకాశాలు, హక్కులు కల్పించడం కోసం పోరాటం చేసి విజయం సాధించారు.తెల్లవారి పక్కనే క్లబ్బులలోనూ ,రెస్టారెంట్లు లోనూ నల్లవారు కూర్చునే హక్కులు సాధించిపెట్టారు కింగ్.*

మార్టిన్ లూధర్ కింగ్ మానవహక్కుల కోసం, సమానత్వపు విలువలు కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప నాయకుడు..ఆయన ఒక సందర్భంలో ఇలా అన్నారు. "మనకు డబ్బును ప్రేమించే నాయకులు వద్దు, నాయకులు కావాలి కానీ న్యాయాన్ని ప్రేమించే నాయకులు అయి ఉండాలి.ప్రచారాన్ని ప్రేమించే నాయకులు వద్దు కానీ మానవత్వాన్ని ప్రేమించే నాయకులు కావాలి ..." కింగ్ చెప్పినట్లు మనకు కూడా అలాంటి నాయకులు కావాలి. 


అరియ నాగసేన బోధి

Comments

Popular posts from this blog

మాల కులం - సాంప్రదాయాలు

RBI

భూమి కొలతలు మరియు రెవిన్యూ భాషలో రికార్డుల పేర్లు