ఆర్టీఐ ఆక్ట్ - సెక్షన్ 18(1) ఏం చెబుతుంది ?
RTI @ న్యూఢిల్లీ టాస్క్ ఫోర్స్ అంటే ఎవరు ? ఎప్పుడు స్థాపించారు ?
*ఆర్టీఐ దరఖాస్తుదారులకు రక్షణ కవచం* టాస్క్ ఫోర్స్ ఎలా అవుతుంది?
సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ ఆక్ట్) ద్వారా సమర్పించిన దరఖాస్తుకు సమాచారం ఇవ్వకుండా.. *RTI Applicant ను బెదిరించినా లేదా అటాక్ చేయడానికి ప్రయత్నం చేసినా... సమాచారం ఇవ్వకపోయినా...* ఆర్టీఐ ఆక్ట్ సెక్షన్ 18(1) ప్రకారం నేరుగా రాష్ట్ర / కేంద్ర సమాచార కమీషన్ కు ఫిర్యాదు చేయవచ్చును.
RTI Applicant ను బెదిరించినా లేదా అటాక్ చేయడానికి ప్రయత్నం చేసిన సంధర్భాలలో:
*సెక్షన్ 18 ప్రకారం ఫిర్యాదు చేసాక, సమాచార కమీషన్ తో పాటు.. మండల పోలీస్ మరియు అడ్మినిష్ట్రేషన్ విభాగం immediate ఆక్షన్* తీసుకోవలసి వుంది.
అలాగే ఆర్టీఐ దరఖాస్తు దారులకు 7 రోజుల వరకు పోలీస్ సెక్యూరిటీ ఇచ్చే బాధ్యత - జిల్లా SP / కలెక్టర్ / పోలీస్ కమీషనర్.
వివరాలకు భారత ప్రభుత్వ - ఆర్టీఐ టాస్క్ ఫోర్స్ ఆర్డర్స్, సుప్రీంకోర్టు తీర్పు, అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు, ప్రిన్సిపాల్ సెక్రటరీలు, DGP లు, హై కోర్టుల రెజిష్ట్రార్ లు తదితర ఉన్నత అధికారులకు భారత ప్రభుత్వ జాయింట్ సెక్రటరీ S. సురేష్ కుమార్, IAS గారు జారీ చేసిన ఆర్డర్స్ refer చేయగలరు.
https://m.facebook.com/story.php?story_fbid=2427917310860907&id=2212250842427556
https://dopt.gov.in/sites/default/files/1_6_2011_IR_Corrs_Vol_II_01052014_0.pdf : ఆర్.టీ.ఐ. ఆక్ట్ టాస్క్ ఫోర్స్ సంబంధించిన భారత ప్రభుత్వ ఆదేశాలు 543 పేజీలు.
http://documents.doptcirculars.nic.in/D2/D02rti/RTI-C.pdf
ఆర్.టీ.ఐ. ఆక్టివిస్ట్ లు ఫేస్ చేసే లిమిటేషన్స్ పై భారత ప్రభుత్వానికి నివేదిక: 48 పేజీల బుక్.
ఈ నివేదిక ఆధారంగా మరియు ఇతర డాక్యుమెంట్ల ఆధారంగా జాతీయ స్థాయి ఆర్.టీ.ఐ. టాస్క్ ఫోర్స్ స్థాపించారు.
టాస్క్ ఫోర్స్ గురించి.. క్లుప్తంగా తెలుసుకోవలసిన అవసరం వుంది.
గమనిక:
*సమాచారం ఇవ్వని సందర్భాలలో సెక్షన్ 19(1) వినియోగం చేయడం సరైన పద్ధతి.* ఈ సందర్భంలో 18(1) వినియోగం చేస్తే: కేవలం సమాచారం ఇవ్వమని మాత్రమే పౌర సమాచార అధికారులకు ఆదేశాలు జారీ చేస్తారు, కానీ *ఎటువంటి చర్యలు తీసుకోవడానికి సమాచార కమీషన్ కు అధికారం లేదు.*
అనివార్య కారణాల వల్ల.. మొదటి అప్పీల్ చేయలేని పరిస్థితుల్లో మాత్రం: సమాచారం రాని సందర్భాలలో సెక్షన్ 18(1) వినియోగం చేయగలరు.
- కౌన్సిల్ ఫర్ సిటిజెన్ రైట్స్ - పౌర హక్కుల సంస్థ.
councilforcitizenrights@gmail.com
Comments
Post a Comment