హైమన్ డార్ఫ్
ఆంత్రోపాలజిస్టులు (మానవ విజ్ఞాన శాస్త్రవేత్తలు) గిరిజన ప్రజలను గురించి అధ్యయనం చేశారు. వారు గిరిజనులతో పాటు నివసిస్తూ వాళ్ళ సంస్కృతి, జీవన విధానం, విశ్వాసాలు, నిర్ణయాలు మొదలైన వాటిని నమోదు చేస్తారు. అటువంటివారిలో ప్రముఖమైన పరిశోధకుడు ఫ్యూరర్ హైమన్ డార్ఫ్. ఇతను 1940లో ఆంధ్రప్రదేశ్కు వచ్చి చెంచులు, కొండరెడ్లు, గోండ్ల గురించి అధ్యయనం చేసి వాళ్ళను గురించి పుస్తకాలు రాశాడు. ఇంకా అతడు భారతదేశంలోని వివిధ గిరిజన తెగలను, ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లోని గిరిజనులను గురించి అధ్యయనం చేశాడు.
1909 జూన్ 22న ఐరోపా ఖండంలోని ఇంగ్లండ్ రాజధాని లండన్ లో జన్మించిన డార్ఫ్..ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్ మండలం మార్లవాయి గిరిజనులకు ఆరాధ్య దైవంగా నిలిచిపోయారు. మట్టి మనుషులకు బాహ్యప్రపంచాన్ని..సంక్షేమాన్ని పరిచయం చేశాడు. గిరిజన అధ్యయనవేత్తగా ఎన్నో ప్రాంతాలు తిరిగారు.. ఎన్నో జాతుల్ని కలిశారు.
1940వ దశకంలో ఆస్ట్రియా దేశపు ఆంత్రోపాలజిస్టు ఆదివాసీల సంస్కృతీ సంప్రదాయాలపై అధ్యయనం చేసి వారి స్థితిగతులను ప్రపంచానికి తెలియజేశారు.
మార్లవాయిలో నివసించిన ఆయన చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్‌కు ఆదివాసీల సమస్యలు వివరించి వారికోసం కొన్ని ప్రత్యేక హక్కులు కల్పించేలా కృషి చేశారు. 1987లో హైమన్ డార్ఫ్ బార్య ఎలిజబెత్, 1995లో డార్ఫ్ లండన్‌లో చనిపోగా వారి కోరిక మేరకు వారి చితాభస్మం తెచ్చి సమాధులు నిర్మించా రు. అప్పటి నుంచి
కుము రం భీం జిల్లా జైనూర్ మండలం మార్ల వాయిలో ఆదివాసీలు హైమన్ డార్ఫ్ జనవరి 11న ఆయన వర్ధంతిని ఏటా నిర్వహిస్తున్నారు.
Comments
Post a Comment