*దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు. ఆ దేశానికి పూర్తి స్థాయి ప్రజాస్వామ్యంలో ఎన్నికైన మొట్టమొదటి నాయకుడు.*
*నెల్సన్ రోలిహ్లాహ్లా మండేలా ( Nelson Rolihlahla Mandela,)*
*18 జూలై, 1918*
*జయంతి*
సేకరణ:
*పి.సనావుల్లా*
*మండేలా కుటుంబం "తెంబు" వంశానికి చెందినది. వీరు దక్షిణ ఆఫ్రికాలో "కేప్ ప్రాంతం"లో "ట్రాన్సకెయన్" బాగాలకు సాంప్రదాయికంగా పాలకులు. ఇతడు ఉమాటా జిల్లాలో మవెజో అనే రిలో 18 జూలై 1918న జన్మించారు. ఇతని తాతలకాలంలో వారు పాలించే తెంబూ తెగల ప్రాంతం బ్రిటిష్ వలస పాలకుల పరమయ్యింది. మండేలా తండ్రి "గాడ్లా" హక్కుల ప్రకారం పాలకుడు కాకపోయినా కొన్ని స్థానిక తెగలకు నాయకుడిగా గుర్తింపు కలిగి ఉండేవాడు. స్థానిక కౌన్సిల్‌లో సభ్యుడు. గాడ్లాకు పదముగ్గురు పిల్లలు.* *వారిలో గాడ్లా భార్య "నోసెకెని ఫాన్నీ"కి జన్మించిన మగబిడ్డకు "రోలిహ్లాహ్లా" (అంటే కొమ్మలు లాగేవాడు -"దుడుకు స్వభావం కలవాడు" ) అని పేరు పెట్టారు. మండేలా బాల్యం తల్లి కుటుంబానికి చెందిన గూడెం ("ఉమ్జీ")లో అధికంగా గడచింది.*
*చదువు*
*ఏడవయేట రోలిహ్లాహ్లా చదువు ప్రారంభమైంది. వారి కుటుంబంలో బడికి వెళ్ళిన మొదటి వ్యక్తి అతనే. స్కూలులోని ఒక మెథడిస్ట్ ఉపాధ్యాయుడు అతనికి "నెల్సన్" అనే పేరు తగిలించారు.*
*(ప్రసిద్ధుడైన బ్రిటిష్ నావికాదళ నాయకుడు హొరేషియో నెల్సన్ పేరు మీద). ఎందుకంటే ఆ మాష్టరుకు రోలిహ్లాహ్లా పేరు పలకడం*.
*రోలిహ్లాహ్లా 9వ యేట అతని తండ్రి క్షయ వ్యాధితో మరణించారు. తరువాత నెల్సన్ మండేలా చదువు వివిధ పాఠశాలలలో సాగింది.* *తెంబూ తెగల ఆచారం ప్రకారం ప్రివీ కౌన్సిల్‌లో అతని తండ్రి స్థానం అతనికి సంక్రమిస్తుంది. 1937లో మండేలా "ఫోర్ట్ బ్యూఫోర్ట్"లో "హీల్డ్‌టౌన్"కాలేజిలో చేరాడు. అతనికి బాక్సింగ్, పరుగు పట్ల ఆసక్తి పెరిగింది.*
*మెట్రిక్యులేషన్ తరువాత మండేలా ఫోర్ట్‌హేర్ విశ్వవిద్యాలయంలో బి.ఎ.లో చేరాడు. అక్కడ అతనికి పరిచయమైన ఆలివర్ టాంబో అతని జీవితకాలం మిత్రుడైనారు.*
*అదే సమయంలో అతని తెగకు వారసత్వంగా నాయకుడు కావలసిన కైజర్ మతంజిమా కూడా మిత్రుడయ్యాడు కాని కాలక్రమంలో వారిద్దరూ రాజకీయ ప్రతిస్పర్ధులయ్యారు. ఎందుకంటే మతంజిమా "బంతూస్తాన్" కార్యకలాపాల పక్షం వహించాడు.ఒక సంవత్సరం తరువాత విశ్వవిద్యాలయం రాజకీయాలలో పాల్గొన్న ఫలితంగా మండేలాను విశ్వవిద్యాలయంనుండి తీసేశారు.*
*జైలు జీవితం*
*రొబెన్ దీవిలో జైలు గది లో 18 సంవత్సరాలు నెల్సన్ మండేలా కారాగారశిక్ష అనుభవించారు.*
*మొత్తం అతని 27 సంవత్సరాల జైలు జీవితంలో 18 సంవత్సరాలు ఇక్కడే గడిచింది. "డి"-గ్రేడ్ ఖైదీ (అందరి కంటె తక్కువ స్థాయి ఖైదీ)గా మండేలాకు చాలా తక్కువ సదుపాయాలు లభించాయి. ఆరు నెలలకొక ఉత్తరం (అదీ సెన్సార్ చేయబడింది), ఒక సందర్శకుడు. సున్నపు క్వారీలో శారీరిక శ్రమ. అతి తక్కువ రేషనులు.*
*జైలులో ఉన్న కాలంలోనే మండేలా లండన్ విశ్వవిద్యాలయం వారి దూర విద్యా సదుపాయంతో బి.ఎల్. పూర్తి చేశారు.*
*అధ్యక్షుడు కాకముందు ఇతను జాతి వివక్ష వ్యతిరేఖ ఉద్యమ కారుడు మరియు ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ కు, దానికి సాయుధ విభాగం అయిన "ఉంకోంటో విసిజ్వే"కు అధ్యక్షుడు. జాతి వివక్షకు వ్యతిరేకంగా జరిపిన పోరాటంలో జరిగిన ఒక మారణకాండకు సంబంధించి 27 సంవత్సరాల పాటు "రోబెన్" అనే ద్వీపంలో జైలుశిక్షననుభవించారు.* *20వ శతాబ్దపు అత్యంత ప్రసిద్ధులైన ప్రపంచ నాయకులలో ఒకరు. నల్లజాతి సూరీడు అని పలు తెలుగు వ్యాసాలలో ఈయన గురించి వర్ణించారు. జాతి వివక్షతకు వ్యతిరేకంగా జరిపే పొరాటాలకు, వర్ణ సమానతకు నెల్సన్ మండేలా సంకేతంగా నిలిచారు.*
*1990 ఫిబ్రవరి 11లో జైలునుండి విడుదల అయిన తరువాత నెల్సన్ మండేలా రాజకీయంగా తన లక్ష్యాన్ని సాధించడానికి, దేశంలో నెలకొన్న జాతి వైర్యాన్ని నివారించడానికి, అందరి మధ్య సయోధ్య పెంచడానికి కృషి చేశారు.* *తన పూర్వపు ప్రత్యర్ధుల నుండి కూడా ప్రశంసలు అందుకొన్నాడు. వందకు పైగా అవార్డులు, సత్కారాలతో వివిధ దేశాలు, సంస్థలు మండేలాను గౌరవించాయి.*
*వాటిలో 1993లో లభించిన నోబెల్ శాంతి బహుమతి ముఖ్యమైనది. స్వదేశంలో మండేలాను మదిబా అని వారి తెగకు సంబంధించిన గౌరవసూచకంతో మన్నిస్తారు.*
*మహాత్మా గాంధీ బోధించిన శాంతియుత విధానాలు, అహింస, శత్రువును సంస్కారయుతంగా ఎదుర్కొనే పద్ధతి తనకు ఎంతో స్ఫూర్తినిచ్చాయని మండేలా పలుమార్లు చెప్పారు. భారత దేశం మండేలాను 1990 లో 'భారత రత్న', జవహర్‌లాల్ నెహ్రూ అంతర్జాతీయ సయోధ్య బహుమతితో సత్కరించింది.* *భారత దేశంనుండి మండేలాకు ఎంతో సమర్ధన లభించింది.* *ప్రపంచవ్యాప్తంగా అణచివేతకు వ్యతిరేకంగా పోరాడే కోట్ల మంది ప్రజలకు మండేలా ఒక ప్రతీకగా మారారు. పశ్చిమ దేశాలు కూడా హక్కుల ఉద్యమ కారులైన అబ్రహం లింకన్, మార్టిన్ లూథర్‌కింగ్‌లతో సమానంగా ఆయన్ను గౌరవిస్తున్నాయి. హింసా మార్గంలో ప్రారంభించిన ఉద్యమాన్ని గాంధేయ మార్గంలోకి ఆయన మలచుకున్న తీరు ఆయనకు దక్షిణాఫ్రికా గాంధీగా పేరు తెచ్చింది.*
*నోబెల్ శాంతి బహుమతితో అంతర్జాతీయ సమాజం ఆయన్ను గౌరవించుకోగా, 1990లో అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇచ్చి భారతీయ సమాజం తనను తాను గౌరవించుకుంది.మండేలా 2013 డిసెంబర్ 5 న మరణించారు.*
*మండేలా మానవతకే స్ఫూర్తి ప్రదాతని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కొనియాడారు. దక్షిణాఫ్రికా మాజీ అధ్య క్షుడు నెల్సన్ మండేలా మృతికి గౌరవసూచకంగా కేంద్ర ప్రభుత్వం ఐదు రోజుల సంతాపదినాలు ప్రకటించింది..*
*అస్తమయం*
*కొంత కాలంగా తీవ్ర శ్వాసకోశ సంబంధ అస్వస్థతతో బాధపడుతూ 2013 డిసెంబర్ 5 న 20:50 (దక్షిణాఫ్రికా ప్రాంతీయ సమయం) కి జోహెన్స్ బర్గ్ లో మరణించారు. వివిధ దేశాలనుండి సుమారుగా 90 మంది ప్రతినిధులు ఆయన అంత్యక్రియలకు హాజరు అయ్యారు.*
Comments
Post a Comment