స. హ. చట్టం ప్రకారం సమాచారం అడిగితే  ఇవ్వము అనడం కూడా నేరమే.

_సమాచార హక్కు చట్టం [2005] అమలులోకి వచ్చిన తరువాత కూడా ప్రజలకు, సంభందిత ప్రభుత్వ అధికారులకు కనీస అవగాహన లేకపోవడంతో, పౌరులకు కావలసిన సమాచారం అందించకపోవడం, లేదా  సమాచారం ఇవ్వడంలో ఆలస్యం జరుగుతుంది._ 

_సమాచారం అడిగితే మావద్ధ లేదు. మేముఇవ్వము. మావద్ద అందుబాటులో లేదు. అంటున్న అధికారుల గురించి, మీరు తెలుసుకోవాలిసిన అంశాలు._
 
_సమాచారం ఇవ్వకపోతే  ఆ ప్రజా సమాచార అధికారి గారు_ *_IPC సెక్షన్స్ 166,167, 217, 218, 219, 220, 420, 406, 407, మరియు 408 నేరపరిధిలోకి వస్తారు_* 

_అందువలన స.హ చట్టం కింద దరఖాస్తుదారులు కోరిన సమాచారాన్ని ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి. లేని పక్షములో సమాచార నిబంధనలు ఉల్లంఘించినందుకు చట్టాన్ని దుర్వినియోగం పరచినందుకు గాను పై సెక్షన్ల ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కమీషనర్లు కూడా  సమాచారం ఇవ్వని అధికారిని జైలుకు పంపవచ్చు అని చట్టంలో పేర్కొనబడింది._

_ఒకవేళ మీకు పూర్తిగా అవగాహన లేకపోతే ఈ క్రింది వివరాలు చూడండి._

*_“సమాచార హక్కు చట్టం" ప్రకారం ప్రభుత్వ కార్యాలయాల నుండి తమకు కావలసిన సమాచారం దరఖాస్తు ద్వారా కోరే హక్కు భారతదేశంలోని ప్రతి పౌరుడికి ఉంది._*

_ప్రతీ దరఖాస్తుదారుడు ఈ చట్టం ప్రకారం వినియోగదారుడే”_

_ఏ పౌరుడైనను తనకు ప్రభుత్వ కార్యాలయంలోని సమాచారం కోరుతూ దరఖాస్తు చేసుకున్న తర్వాత 30రోజుల్లో సమాచారం ఇవ్వకుంటే "వినియోగదారుల ఫోరమ్"కు వెళ్ళి ఫిర్యాదు చెయ్యవచ్చు._

_సమాచారాన్ని కోరటానికి దరఖాస్తు ఫారం లేకపోతే, కావలసిన సమాచారం  తెల్లకాగితంపై వ్రాసి IPO (ప్రజా సమాచార అధికారి)ని అడగవచ్చు._

_సమాచారం కోరుతూ అధికారికి డైరెక్టుగా గాని, "రిజిస్టర్"పోస్టు ద్వారా అయిన పంపి అడగవచ్చు._

*_“దరఖాస్తుదారునికి వయసు స్థానికత అవసరం లేదు”_*

_సెక్షన్ 2 (f)ప్రకారం సమాచారం నిర్వచనం.(కార్యాలయాల్లో రికార్డులు, పత్రాలు, మెమోలు, ఇమెయిల్స్, అభిప్రాయాలు, పుస్తకాలు, ప్రకటనలు, సీడీలు, డివిడిలు, మొదలైనవి)._

_సెక్షన్ 2 (h)ప్రకారం సమాచార  హక్కు చట్ట పరిధిలోకి వచ్చే ప్రభుత్వ కార్యలయాలు  (ప్రభుత్వంచే గుర్తింపుబడిన, స్వచ్చంద సంస్థలు) లేదా పౌరులు కోరవచ్చు._

*_సెక్షన్2(i) ప్రకారం రికార్డు నిర్వచనం._*

_సెక్షన్ 2(j)ప్రకారం ప్రభుత్వం చేపట్టే అన్ని కార్యక్రమాలు పరిశీలించవచ్చు._

_ఏ ప్రభుత్వపు కార్యాలయంలోని రికార్డులనైనా దరఖాస్తు చేసుకొని తనిఖీ చేయవచ్చు. అవసరం అయితే జిరాక్స్ కాపీ తీసుకోవచ్చును._

_సెక్షన్2(j)(1) ప్రకారం పనులను, పత్రాలను తనిఖీ చేసే హక్కు (ఒక గంటకు రూ,,5/-లు)._

_సెక్షన్ 3 ప్రకారం సమాచారం కోరిన పౌరుడికి సమాచారం ఇవ్వాలి. (దరఖాస్తు చేసుకోవడానికి మీ పరిధి కాదు అని ప్రశ్నించడానికి వీలు లేదు)._

*_సెక్షన్4(1)(a) ప్రకారం ప్రతి శాఖ వారు రికార్డు నిర్వహణ._*

_సెక్షన్ 4(b) ప్రకారం స్వచ్చందముగా వెల్లడించవలసిన సమాచారం ఎవరు అడగక ముందే ఆ సమాచారాన్ని అందుబాటులో ఉంచాలి._

_సెక్షన్ 4(1)(c), (d) ప్రకారం నిర్ణయాలు. సమాచారం కావాలని కోరిన వాటికీ కారణాలు చెప్పనవసరం లేదు (సమాచారం ఎందుకు అని చెప్పక్కరలేదు)_

_సెక్షన్4(2) ప్రకారం వీలయినంత ఎక్కువగా స్వచ్చందంగా ఇవ్వవలసిన సమాచారం ఇవ్వాలి._

*_సెక్షన్4(4) ప్రకారం స్థానిక భాషలో ఇవ్వాలి._*

_సెక్షన్5(1),(2) ప్రకారం ప్రజా సమాచార అధికారులు (IPO) అప్పిలేట్ అధికారుల నియామకం._

_సెక్షన్-6(1)ప్రకారం సమాచార హక్కు దాఖలు చేసే విధానం._

_సెక్షన్6(2)ప్రకారం సమాచారం ఎందుకు అనేది సంభందిత ప్రభుత్వ అధికారులకు చెప్పనక్కరలేదు._

_సెక్షన్ -6(3) ప్రకారం కోరిన సమాచారం తమ వద్ద లేకపోతే ఆ సమాచారం ఉన్న సంబంధిత ప్రభుత్వశాఖ అధికారికి దరఖాస్తు బదిలీ చేయాలి. (సమాచారం మరో కార్యాలయానికి పంపవలసిన బాధ్యత కూడా అధికారులదే)._

_సమాచార హక్కు చట్టం సెక్షన్-7(1) ప్రకారం 30రోజుల లోపు పౌరునికి సమాచారం ఇవ్వవలసిందే._

_వ్యక్తి జీవితానికీ స్వేచ్ఛకు లేదా ప్రాణహాని ఉన్నటువంటి వాటికి సంభందించినది ఐతే 48 గంటల లోపే ఇవ్వాలి._

_సెక్షన్7(3)(a)ప్రకారం సమాచార రుసుము (కోర్టుకు సంభందించి మాత్రం రూ,,25-లు మిగతా శాఖ వారికి రూ,,10/-లు మాత్రమే చెల్లించాలి._

_నగదు ఏ రూపంలో చెలించాలంటే_

_(1) నగదు రూపంలో_
_(2) ఇండియన్ పోస్టల్ ఆర్డర్లు._
_(3) డిమాండ్ డ్రాఫ్టు._
_(4) కోర్టు ఫీ స్టాంపు రూపంలో_
_(5)బ్యాంకర్స్ _చెక్కురూపంలో మాత్రమే దరఖాస్తు రూ,,10/-లు రుసుము ఎకౌంట్ అధికారి పేరిట పంపించాలి._

_వీలయినంత మేరకు "పోస్టల్ ఆర్డరు" మాత్రమే రుసుముగా చెల్లించాలి._

_(ప్రతి పేజీకి, ఏ-4 రూ,,2/-లు చొప్పున, సీడికి రూ,,100/-లు చొప్పున, ప్లాపికి రూ,,50/-లు, డీవీడీకి రూ,,200-లు రుసుము చెలించాలి._

_కోర్టులో ప్రతి పేజీకి రూ,,5/-లు చొప్పున చెల్లించాలి)._

_సెక్షన్ 7(1) ప్రకారం దరఖాస్తు గడువు 30 రోజులు._

_సెక్షన్7(6) ప్రకారం గడువులోపు సమాచారం ఇవ్వకుంటే సమాచారం ఉచితముగా ఇవ్వాలి._

_సెక్షన్8(1)ప్రకారం సమాచారం మినహాయింపులు (డాక్టర్ "పెషెంట్"కు ఇంజెక్షన్ ద్వారా ఇచ్చిన మందులు, మనిషికి ఉన్న వ్యాధులు, దేశరక్షణకు సంభందించిన ఒప్పందాలు) తదితరాలు ఉన్నాయి._

_సెక్షన్8(2)ప్రకారం అడిగిన సమాచారంలో ప్రజాప్రయోజనం ఉంటే   మినహాయింపులు వర్తించవు._

_సెక్షన్18(1)ప్రకారం సమాచారం ఇవ్వని క్రింది స్థాయిలో ఉన్నటువంటి అధికారిపై కమీషన్లకు పిర్యాధు చెయ్యవచ్చు._

_సెక్షన్19(1)ప్రకారం మొదటి అప్పీలు కోరాలి._
 
_సెక్షన్19(3)రెండవ అప్పీలు, 90 రోజుల లోగా రాష్ట్ర కేంద్ర సమాచార కమీషన్ వారికీ అప్పీల్ చేసుకోవాలి._ 

_అప్పీలు సమాచారం కోరుటలో ఆలస్యం అయితే సరైన కారణాలు చూపుతూ 90 రోజుల తరువాత అప్పీల్ చేసుకోవచ్చు._

_సెక్షన్19(1)ప్రకారం కమీసన్ల నిర్ణయాలు ఉంటాయి._

_సెక్షన్-19(8)(b) ప్రకారం ధరాఖస్తుదారు తనకు  కలిగిన ఆర్థికపరమైన కష్టనష్టాలపై కమిషన్ ఆధారాలు సమర్పించాలి._

_దరఖాస్తుదారుడునకు జరిగిన నష్టం సక్రమంగా ఉంటే నష్టపరిహారం మంజూరు చేయాలి._

_సెక్షన్20(1)ప్రకారం సమాచారం ఇవ్వకపోతే  (తప్పుడు సమాచారం ఇస్తే రోజుకు రూ,, 250/-లు చొప్పున రూ,, 25,000/-లు వరకు జరిమానా ఉంటుంది._

_సెక్షన్20(2)ప్రకారం క్రమశిక్షణ చర్యలకు సిఫారసునకు అర్హుడవుతాడు._

_గడువులోగా సమాచారం ఇవ్వకపోతే వినియోగదారుల ఫోరానికి వెళ్ళవచ్చు._

_ఐపీవో (IPO) తప్పుడు సమాచారం ఇస్తే రాష్ట్ర కమిషనర్ లేకుంటే  డైరెక్టుగా న్యాయస్థానానికి వెళ్ళవచ్చు._

*పిళ్లా కుమారస్వామి*

🍂🍃🍂🍃🍂🍃🍂

Comments

Popular posts from this blog

మాల కులం - సాంప్రదాయాలు

RBI

భూమి కొలతలు మరియు రెవిన్యూ భాషలో రికార్డుల పేర్లు