మగధ మహాజనపదం



 మగధ   గంగానదికి రెండువైపులా విస్తరించి ఉండేది.  నదులు భూములను సారవంతం చేస్తాయి. గృహపతులు తమ భూములను సులభంగా సాగుచేసుకొనేవారు. నదులమీద సరుకు రవాణా చేసేవారు, సైనికులను తరలించేవారు. మగధలోని కొంత ప్రాంతంలో అడవులున్నాయి. ఈ అడవుల నుంచి ఏనుగులను పట్టుకొని యుద్ధాలలో పోరాడటానికి వాటికి శిక్షణ ఇచ్చేవారు. అడవులనుంచి లభించే కలపతో కోటలు, రాజభవనాలను, రథాలను నిర్మించటానికి ఉపయోగించేవారు. మగధ రాజ్యంలోని దక్షిణ ప్రాంతంలో ఇనప ఖనిజ నిక్షేపాలు ఉండేవి. వాటిని ఉపయోగించి ఆయుధాలు మొదలైనవి తయారుచేసేవారు.

వీటన్నింటి కారణంగా మగధరాజ్యం బలమైన రాజ్యంగా ఎదిగింది. మొదటి రాజులైన బింబిసారుడు, అజాతశత్రుపు మగధను బలమైన రాజ్యంగా తీర్చిదిద్దారు. మహాపద్మనందుడు మరొక బలమైన రాజు. ఈ రాజులందరూ తమ సైన్యంతో ఇతర రాజ్యాలను జయించారు. దాని ఫలితంగా మహాపద్మనందుని కాలంలో రాజ్యం వాయువ్యం నుంచి ఒడిశా వరకు విస్తరించింది.

మగధ మాదిరిగా అన్ని మహాజనపదాలు రాజుల పాలనలో లేవన్న సంగతి గుర్తుంచుకోవాలి. కొంత మంది రాజులు గోండు పెద్దల మాదిరిగా సాధారణ ప్రజలమీద ఆధారపడి తమ రాజ్య సంక్షేమంకోసం సాంప్రదాయాలను పాటించేవారు, పండగలు నిర్వహించేవారు.

Comments

Popular posts from this blog

మాల కులం - సాంప్రదాయాలు

RBI

భూమి కొలతలు మరియు రెవిన్యూ భాషలో రికార్డుల పేర్లు