🔹 మాల కులం పేరు - దాని అర్ధం🔹 జర్మన్ చరిత్రకారులు Gustav Solomon Oppert గారి అధ్యాయనం ప్రకారం,, ద్రవిడ సంస్కృతి, ద్రవిడ చరిత్ర "మాల" అనే పేరుతో పెనవేసుకుని ఉన్నట్లు, తన పరిశోధనా గ్రంథం The Original Inhabitants of Bharata Varsha or India - The Dravidians (భారత దేశ అసలైన భూమి పుత్రులు - ద్రవిడులు) లో పేర్కొన్నారు.. పర్వత ప్రాంతం (హిమాలయాలు -సింధు లోయ - సింధు నాగరికత) నుండి వచ్చినవారిగా చెప్పబడే "మాలవ" అనే ఈ Proto-Dravidian జాతి ప్రజలను, భారత దేశం అంతటా, పర్వతానికి పర్యాయపదాలైన పేర్లతో పిలవబడ్డారు అని రాశారు.. ఆ విధంగా,, "మాల" అనే పేరు పర్వతానికి పర్యాయపదం అయిన "మలై" అనే పేరు నుండి వచ్చింది.. వీరినే మల్లార్(పరయా-పరయా అంటే సందేశాన్ని చేరవేసేవాడు) అని, గంగా పరివాహిక ప్రాంతంలో మల్లలు అని,, బెంగాల్ ప్రాంతంలో మాల్ లు అని,, మేరు పర్వతం పేరుతో పడమరలో, మార్లు అని, మహార్లు అని,, భార్ లు అని పిలిచినట్టు,, వీరే ద్రవిడ సాంస్కృతికి మూలాల అని Gustav Oppert పేర్కొన్నారు.. తమిళ సంగం సాహిత్యంలో కూ...
రూపం మార్చుకుంటున్న ఫాసిజం_ ప్రజాస్వామిక వాదుల కర్తవ్యాలు "ఫాసిజం ముఖ్యమైన లక్షణం సత్యాన్ని విమర్శించడానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకపోవడం." ___ జార్జ్ ఆర్వెల్ ఫాసిజం 20వ శతాబ్దపు ప్రారంభంలో యూరప్‌లో మొదలైన ఒక రాజకీయ భావజాలం. ఇది ప్రధానంగా మన జాతి ఉన్నతమైనదని ప్రచారం చేసే జాతీయవాదం తో మొదలవుతుంది. మాధ్యమాలను నియంత్రిస్తుంది. మతాన్ని రాజకీయాలతో కలిపి యూదులు, కమ్యూనిస్టులను సామాజిక శత్రువులుగా ప్రచారం చేస్తుంది. ఫాసిజం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పని చేసే ఒక రాజకీయ ధోరణి. ఇది అతిజాతీయ వాదాన్ని, మతాధిక్యతను, స్థానికతను ఉపయోగించుకుంటూ విదేశీయులకు వ్యతిరేకంగా హింసను సాధనంగా చేసుకుంటుంది. ఇటలీలో ముస్సోలిని, జర్మనీలో హిట్లర్, స్పెయిన్‌లో ఫ్రాంకో వంటి నియంతలు దీన్ని గణనీయంగా అనుసరించారు. భారతదేశంలో ఈ ధోరణులను మెజారిటీ మతవాద సంస్థ దీన్ని అమలు చేయడం గమనించవచ్చు. ఇటలీలో బెనిటో ముస్సోలిని (1922-1943) ఫాసిజాన్ని కార్పొరేటివిజంగా అమలు చేశాడు, జర్మనీలో అడాల్ఫ్ హిట్లర్ (1933-19...
2024 వక్ఫ్ (సవరణ) బిల్లు – ముఖ్య ాంశాలు: 1. సర్వే అధికార మార్పు: వక్ఫ్ భూముల సర్వే అధికారాన్ని వక్ఫ్ కమిషనర్ నుండి కలెక్టర్‌కు బదిలీ చేయడం ద్వారా ముస్లింల అధికారాన్ని తగ్గించారు. 2. బోర్డు సభ్యుల మార్పు: వక్ఫ్ బోర్డులో ముస్లింల సంఖ్య తగ్గించి, ముస్లిం కాని సభ్యులను మెజారిటీగా నియమించే అవకాశం కల్పించారు. ఇది ముస్లింల అభిప్రాయాలను బేఖాతరు చేయడానికే. 3. ముస్లిం మహిళల ప్రాతినిధ్యం: ఇద్దరు ముస్లిం మహిళల నిబంధన ఉన్నా, మిగతా సభ్యులలో ముస్లిం కానివారు ఉంటే వహీ ముస్లిం మహిళల అభిప్రాయాలు బలహీనమవుతాయని విమర్శ. 4. సీఈఓ నియామకం: మతపరమైన అవగాహన లేకపోయినవారు ఈ పదవిలోకి వస్తే, సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. 5. ట్రిబ్యూనల్ మార్పులు: ముస్లిం చట్ట నిపుణుని తప్పించడం ద్వారా, న్యాయ నిర్ణయాల్లో మత పరమైన అవగాహన లేకుండా పోతుంది. 6. వక్ఫ్ దానం నిబంధన: ఐదు సంవత్సరాలుగా ముస్లిం మతాన్ని అనుసరించినవారే వక్ఫ్‌కు ఆస్తి దానం చేయగలరన్న నిబంధన, ఇది కొత్తగా మతం మార్చినవారికి అడ్డంకిగా మారుతుంది. 7. సామూహిక న్యాయం గురించి ప్రశ్న: హిందూ దేవాలయాల పాలనలో మతేతరులకు చట్టం అవకాశం కల్పించకపోవడం, కానీ వక్ఫ్ బోర్డులో...
Comments
Post a Comment