వైదిక మతం ఆవిర్భావం
# విదేశీ బ్రాహ్మణీయ వ్యవస్థ ఋగ్వేదకాలం నాటిది. బ్రాహ్మణులు విదేశీయులని బాల గంగాధర తిలక్ 1903లో ఆయన రాసిన " The Arctic Home in The Vedas" పుస్తకంలో గొప్పగా చెప్పుకున్నాడు.నెహ్రూ తన పుస్తకం " డిస్కవరీ ఆఫ్ ఇండియా"లో కూడా ఆర్యుల గూర్చి చర్చించడం జరిగింది.
# క్రీ.పూ.1500 కాలంలో ప్రస్తుత పంజాబ్ ,హర్యానా,పశ్చిమ ఉత్తరప్రదేశ్,యమునా నదీ ప్రాంతంలో ఋగ్వేద సంస్కృతి విలసిల్లినట్లు చరిత్రకారులు భావిస్తారు.
# వీరు తొలుత సంచార జీవులు. భారతదేశం వచ్చాక వ్యవసాయం చేయడం నేర్చుకున్నారు.వీరికి ఉన్న గుర్రాలు వేగంగా ప్రయాణించడానికి తోడ్పడేవి. ఇనుముతో చేసిన ఆయుధాలు వీరి వద్ద ఉన్నాయి.
# వాళ్లకున్న ఆధారం గోవులు & గుర్రాలు..వాటిని మేపుకుంటూ పచ్చటి గడ్డి ఉన్న మైదానాలు వెతుకుతూ పశ్చిమ యూరప్ నుండి వచ్చారు.
# ఆదిమ మానవులు గుంపులు గుంపులుగా బతుకుతూ కొన్ని గుంపులు తలా ఒక దిక్కుకు ఆహారాన్వేషణలో భాగంగా వెళ్లేవారు.ఈ భూమి అంతా మనుషులు ఇలాగే విస్తరించారు.
# ఇరాన్ లో కొంతకాలం ఉన్న ఆర్య తెగలు అక్కడ నుండి ఒక గుంపు హిందూకుష్ పర్వతాల మీదుగా మన దేశం వచ్చారు.
# ఋగ్వేద ఆర్యులు మాంసాహారులు . పశుపోషణ వృత్తి . మంచి యుధ్ధ పిపాసులు. అప్పట్లో గోవు వీరికి ఇష్టమైన ఆహారం. వారు చేసే గో మాంస & గుర్రం మాంస భక్షణ వారిని ధృఢకాయులుగా చేసింది.
# మాంసాహారం కోసమే పశుపోషణ చేసి ఊండవచ్చు...యజ్ఞం అయ్యాక యజ్ఞ పశువును బలి ఇచ్చి భుజించేవారు .
# ఋగ్వేద కాలంలో యజ్ఞాలు లేవు. తర్వాత యజుర్వేదం వచ్చింది.దీనిలో యజ్ఞాలు చేసే వివరాలు ,యజ్ఞకుండలి నిర్మించే విధానం వివరించబడింది.
# తర్వాత వచ్చిన సామవేదంలో సంగీతం కూర్చి , పాడిన పాటలున్నాయి.
# తర్వాత అధర్వణ వేదం వచ్చింది .ఈ 4వ వేదంలో తాయెత్తులు ,క్షుద్ర పూజలు,ఆయుర్వేదం ,వైద్యం చెప్పబడ్డాయి.ఈ చివరి వేదంలో చెప్పినవి చాలావరకు ఇక్కడి మూలవాసుల నుండి గ్రహించిన సమాచారమేనని ఒక వాదన. మూలవాసి ప్రజలు ఉపయోగించే నాటు వైద్యం , ఔషధ మొక్కల గూర్చి అధర్వ వేదంలో రాశారని అంటారు.
# అంటే యజ్ఞాల పేర సాగిన హింసకు ప్రతిగా.., మనిషిని సాత్వికంగా మార్చడానికి - భయాలు తగ్గించడానికి సామ,అధర్వ వేదం పుట్టుకొచ్చింది.
# ఋగ్వేదంలో పేర్కొనబడ్డ దేవతల్లో ఇంద్రుడు ,అగ్ని , వరుణుడు,సోమ రసం ముఖ్య దేవతలుగా చెప్పబడ్డారు. సోమ రసం ఒక రకమైన మత్తు పానీయం. సోమ లత అనే తీగను నలగ దంచితే వచ్చే రసాన్ని తాగేవారు.ఈ రసం కనీసం 15 రోజుల దాకా మత్తేక్కిస్తుంది.ఇది తాగకుండా ఉండలేకపోయేవారని ఋగ్వేద శ్లోకాల్లో వారే చెప్పుకున్నారు.
# సోమ రసం తాగాక ఇంద్రునికి విపరీతమైన శక్తి వచ్చేదట.ఆ బలంతో మదమెక్కి కనపడ్డ దస్యుడిని చంపేవాడని చెప్పారు.మన దేశ మూలవాసులని దాసులు ,దస్యులని ఋగ్వేదంలో చెప్పడం గమనార్హం.
# ఇంద్రుడిని పురంధరుడు అని ఋగ్వేదంలో కీర్తించారు. పురంధరుడు అంటే పురములను ధ్వంసం చేసినవాడని అర్థం. హరప్ప ,మొహంజోదారో మొదలైన సింధు పట్టణాలను నాశనం చేసాడని ఋగ్వేదం ద్వారా మనకు అర్థమవుతూనే ఉంది.
# యజ్ఞానికి విశేష ప్రాధాన్యత ఇవ్వటం వైదిక బ్రాహ్మణ మత ముఖ్య లక్షణం.
------------------ చరిత్ర
*కృష్ణమాచారి మడుపు*
Comments
Post a Comment