కూటమి ఏర్పాటులో కీలకమైన జనసేన ప్రస్థానం


కూటమి ఏర్పాటులో కీలకమైన జనసేన ప్రస్థానం 

             "చేగువేరా మా ఆదర్శం. పవర్ కోసం కాదు ప్రశ్నించడం కోసం మేమున్నాం" అంటూ సినిమాలలో నటిస్తున్న పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి ప్రవేశించారు. తన అన్న చిరంజీవి రాజకీయాల్లో ఏర్పరచిన ఖాళీని భర్తీ చేస్తూ 2014లో మార్చి 10న జనసేన పార్టీ ని హైదరాబాద్ లో స్థాపించారు. అదిప్పుడు రెండు తెలుగు రాష్ట్రా లలో ఉంది. జన సేన అంటే ప్రజా సైన్యమని అర్ధం. పార్టీ లోగో, రంగులు పెద్ద పెద్ద ఆశయాలను తలపిస్తాయి. జనసేనాని మాటలు కూడా పెద్ద పటాటోపంతో ఉంటాయి. కానీ ఆచరణలో ఆ పార్టీ అందుకు భిన్నంగా ఉండటం అందరినీ కలవరపెడుతోంది.. 

      పార్టీ ని ప్రారంభిస్తున్న సమయంలో బ్లాక్ మార్కెట్ వ్యవహారాల నిర్మూలన, విద్య, వైద్యం మెరుగుపరచడం, చట్టాల అమలులో అందరికీ సమన్యాయం, ప్రజాధనం వ్యయానికి కాపలా, జాతీయ సమైక్యత లను జనసేన మౌలిక లక్ష్యాలుగా పేర్కొన్నారు పవన్.
    
       పార్టీ చిహ్నాన్ని మన దేశ చరిత్రను, పోరాటాలను నిర్వచించే ఒక ఐక్య సంఘటన గా చెప్పుకున్నారు. చిహ్నం లోని తెలుపు రంగు భారత నాగరికత, సంస్కృతిని, అనేక వేల సంవత్సరాల నుంచి ఉన్న శాంతిని, స్థిరత్వాన్నిసూచిస్తుందన్నారు. ఎరుపు రంగు సామాజిక మార్పును సూచిస్తుంది. నక్షత్రం పార్టీ ఆదర్శాలకు ప్రతిరూపం.నక్షత్రం సహజంగా స్వయంప్రకాశక గుణం కలిగి ఉంటుంది. అందువల్ల ఆ నక్షత్రం, ఆ పార్టీ స్వయంగా ఇతరుల మద్దతు లేకుండా ఎదిగే గుణాన్ని కలిగి ఉంటుందన్నారు. మధ్యలో ఉన్న కేంద్ర బిందువు ప్రతి మనిషి ని సూచిస్తుంది. నల్లని చారలు విప్లవానికి గుర్తు.అందువల్ల దాన్ని వ్యతిరేకించే శక్తులతో పోరాడుతుంది. పక్షపాతం లేకుండా ప్రజాపక్షం వహిస్తుంది. ఇన్ని విప్లవాత్మక భావాలతో ఏర్పడిన పార్టీ 2019లో జనసేన వామపక్షాలతోనూ బిఎస్పీతోను పోతు పెట్టుకుంది. ఆ ఎన్నికల్లో ఈ పార్టీ కేవలం ఒక్క సీటు మాత్రమే గెలిచింది. తర్వాత వాటి నుండి విడగొట్టుకొని భావసారూప్యత ఏమాత్రం లేని బిజెపితో జుట్టు కట్టడం రాజకీయ పరిశీలకులను ఆశ్చర్యపరిచింది. "ఆదర్శాలకు నోళ్లు చాలవు ఆశయాలకు ఫైళ్లు చాలవు, పదపదమంటూ పలుకులే గాని కదలని అడుగు దేనికనీ?" అని సినారె చెప్పింది ఈ పార్టీ కి బాగా వర్తిస్తుంది. మతాల ప్రస్తావనలేని రాజకీయం జనసేన అభిమతం. కానీ ఆచరణలో హిందూత్వ రాజకీయాలపై ఆధారపడిన బిజెపితో జట్టు కట్టడం ఏం తెలియజేస్తుంది?కులాలను కలిపేఆలోచనా విధానం ఆ పార్టీ సిద్ధాంతం. కులాలను కలపాలా? కులనిర్మూలన చేయాలా? కులాలను అలాగే ఉంచితే సామాజిక మార్పు ఎలా వస్తుందో ఆ పార్టీనే చెప్పాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలు బాగుపడాలంటే రాజకీయ జవాబుదారీతనం కావాలనేది జనసేన ప్రధాన సిద్ధాంతం.కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఏక మొత్తంగా ప్రభుత్వ రంగసంస్థలను అమ్మేస్తున్నా కనీసం ప్రశ్నించలేదు పోయింది జనసేన. తన సిద్ధాంతాల్ని కేవలం పుస్తకాలకు, మానిఫెస్టో కు మాత్రమే పరిమితం చేసిందనుకోవాలా?
భాషలను గౌరవించేసంప్రదాయం, సంస్కృతులనుకాపాడే సమాజం, ప్రాంతీయతను విస్మరించనిజాతీయవాదం జనసేన సిద్ధాంతాలుగా పేర్కొనింది.అవినీతి నేడు విశృంఖలంగా ఉంది.దాన్ని నిర్మూలించాల్సిన అవసరం నేడుంది.కానీ అవినీతి పై పోరాటానికి కలిసి వచ్చే శక్తులతో జట్టు కట్టాలి. ప్రజలను చైతన్య వంతుల్ని చేయాలి. నేడు పర్యావరణ పరిరక్షణ అత్యంత ఆవశ్యకమైనది. ఈ అజెండా ను చాలా పార్టీ లు విస్మరించాయి. జనసేనప్రజలను సమీకరించి పోరాటమే రాజకీయం. మరి రాజకీయ పార్టీ గా ఉండి తాను సంకల్పించిన పథకానికి పాలకులు విఘాతం కలిగిస్తున్నప్పుడు స్పందించక పోతే ఎలా?
పోరాటం చేస్తున్నప్పుడు అధ్యక్షుడు కనీసం వారికి సంఘీభావం ప్రకటించడానికి రాజకీయ లబ్ధి ఎలా చేకూరుతుంది?ముస్లింల అభివృద్ధికి సచార్‌ కమిటీ విధానాలు అమలు చేయాలని జనసేన సరైన డిమాండ్ చేపట్టింది. కేంద్రం లోని బిజెపి ఇప్పటికే వారిపట్ల సవతి ప్రేమ చూపుతున్న పరిస్థితి ఉంది. మరి ఆ బిజెపితో చెలిమి చేస్తూ ముస్లింలకు న్యాయం ఎలా చేయగలుగుతుంది జనసేన?

ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్‌ విధానం రద్దు చేయాలని కోరుతోంది జనసేన. మరి లక్షలాదిమంది ఈ విషయంపై పోరాటం చేస్తున్నప్పుడు అధ్యక్షుడు కనీసం వారికి సంఘీభావం ప్రకటించలేకపోయాడు. ముస్లింల అభివృద్ధికి సచార్‌ కమిటీ విధానాలు అమలు చేయాలని జనసేన సరైన డిమాండ్ చేపట్టింది. కేంద్రం లోని బిజెపి ఇప్పటికే వారిపట్ల సవతి ప్రేమ చూపుతున్న పరిస్థితి ఉంది. మరి ఆ బిజెపితో చెలిమి చేస్తూ ముస్లింలకు న్యాయం ఎలా చేయగలుగుతుందో మరి? బహిరంగంగా నే ముస్లిం లను ఓట్లకోసం మేం బుజ్జగించమని చెపుతోంది. వారి పట్ల ద్వేషాన్ని పెంచే వారిపట్ల ఉదాసీనంగా ఉంటోందని పలువురు భావిస్తున్నారు.  మత ప్రస్థావన లేని రాజ్యం కావాలని తాను జాషువా చెప్పినట్లు విశ్వనరుడ నని చెప్పుకున్నారు పవన్. దేశ మూలాలు గొప్పవి. వసుధైక కుటుంబం అనేది ఎప్పటినుంచో ఉంది. ముస్లిం ల పై దాడులు జరిగితే జనసేన బిజెపి పొత్తు నుంచి బయటకు వస్తుందన్నారు. మతాలను కించ పరచరాదన్నాడు. ఒకవైపు ఆ పార్టీ బహిరంగంగా నే ముస్లిం లను ఓట్లకోసం మేం బుజ్జగించమని చెపుతోంది. వారి పట్ల ద్వేషాన్ని పెంచే వారిపట్ల ఉదాసీనంగా ఉంటోందని పలువురు భావిస్తున్నారు.  మత సామరస్యాన్ని కాపాడతామని చెప్పే పార్టీ దానికనుగుణంగా కార్యాచరణ ఉండాలి గదా. అప్పుడే అది ప్రజల్లో విశ్వసనీయత పెంచుకుంటుంది.

          పార్టీ స్థాపించిన తొలినాళ్ళలో ఎన్నికలలో పోటీచేయకుండా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చి ఆ పార్టీ విజయానికి దోహదం చేశారు. తరువాత
2024లో జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. 45 కోట్లు సినిమా ద్వారా సంపాదించగలిగినా దాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చానని చెప్పాడు కళ్యాణ్. 6.5 లక్షలు కార్యకర్తలున్నా రన్నాడు.  కాపులు అండగా నిలవాలన్నాడు.నమో అవసరమన్నారు. ప్రత్యేక హోదా కావాలన్నాడు. 
         ఏ రాజకీయ పార్టీకైనా అధికారమే అంతిమ లక్ష్యం. జగన్ ప్రభుత్వం చంద్రబాబును స్కిల్ డెవలప్మెంట్ లో అవినీతి ఆరోపణల కింద అరెస్టు చేసి ఒక నెలకు పైగా జైల్లో ఉంచాడు. ఇది కక్ష సాధింపు చర్య అని చూసిన వారికి ఎవరికైనా అర్థమవుతుంది ఆ సందర్భంలో పవన్ తన రాజకీయ ప్రస్తానానికి ,తన పార్టీ మనుగడకు అవకాశం గా భావించి తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటానని బిజెపితో సంప్రదించకుండానే ప్రకటించాడు. 2024లో ఇండియా కూటమి ఘనవిజయం సాధించడంతో ఆయన వేసిన అడుగు సరైన ఫలితాన్ని ఇచ్చిందని విశ్లేషకులు భావిస్తున్నారు.           
            
___ పిళ్లా కుమారస్వామి



Comments

Popular posts from this blog

మాల కులం - సాంప్రదాయాలు

RBI

భూమి కొలతలు మరియు రెవిన్యూ భాషలో రికార్డుల పేర్లు