వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ప్రస్థానం
వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ప్రస్థానం
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ లేదా వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర ప్రదేశ్ లో రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన రాజకీయ పార్టీ. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు డా. వై.యస్. రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదం లో మరణించడంతో ఆయన కుమారుడు , కాంగ్రెస్ పార్టీ ఎం.పి. వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఈ పార్టీ ని స్థాపించారు.
తండ్రి మరణించాక జగన్ ఓదార్పు యాత్ర చేపట్టాడు. అందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒప్పుకోలేదు. దాంతో జగన్ క్రొత్త పార్టీ నెలకొల్పాలనుకున్నాడు. వైఎస్సార్ కాంగ్రెస్ ను 2011 మార్చిలో స్థాపించారు. సహజంగానే జగన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్యక్షునిగా ఉన్నారు.
పార్టీ పెట్టగానే సోనియాగాంధీ నుంచి రాజకీయ కక్షసాధింపులు మొదలయ్యాయి. సిబిఐ కేసులు జగన్ పై పెట్టారు. సంస్థాగతంగా బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఈ కేసులో చాలా సహకరించాయి.అండగా ఉంటారనుకున్న సొంతవాళ్లే దూరమయ్యారు. దాంతో పాటు చాలామంది నాయకులు జారిపోతున్నారు. ఆ సందర్భంలో ప్రజాబలం కూడగట్టుకోవడం ఒక పెద్ద సవాల్.. ఈ నేపథ్యంలో ఓదార్పు యాత్ర నిరంతరంగా చేపట్టి నిత్యం ప్రజల్లో ఉన్నాడు జగన్.
2014 లో తొలిసారిగా విభజన తర్వాత జరిగిన శాసన సభ ఎన్నికల్లో తెలుగు దేశం రుణమాఫీ పథకం ప్రకటించింది , బిజెపి తో పొత్తు పొత్తు పెట్టుకుంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేసింది. రుణమాఫీ లాంటి అద్భుతమైన పథకాన్ని ప్రకటించలేదు. దాంతో ఆ పార్టీ గెలుపుకు 2% తక్కువ ఓట్ల దూరంలో ఉండిపోయింది. 2014 సార్వత్రిక ఎన్నికలలో దేశంలోని మొత్తం ప్రాంతీయ పార్టీల్లో ఒంటరిగా అధిక ఓట్ల శాతం సాధించిన పార్టీగా పేరొందింది. ఈ ఎన్నికలలో అత్యధిక ఎంపీ సీట్లు గెలుచుకుంది. మొత్తం 25 ఎంపీ సీట్లు ఉంటే అందులో 22 వైఎస్ఆర్ పార్టీ , మూడు తెలుగుదేశం పార్టీ సాధించింది. కానీ ఈ ముగ్గురు తెలుగుదేశం పార్టీ ఎంపీలు బిజెపిలోకి జంప్ అయ్యారు సీమాంధ్రలో మొత్తం పోలయిన ఓట్లలో 44.4% సాధించింది.తెలంగాణాలో కూడా ఆ పార్టీ రెండు సీట్లు గెలుచుకోవడం విశేషం.
స్వల్ప తేడాతో ఓడి పోయినప్పటికీ కూడా ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల కోసం ప్రజా ఉద్యమాలు చేపట్టి ప్రజలకి బాగా చేరువయింది. వైఎస్సార్ పార్టీ ప్రత్యేక హోదా పై పెద్ద ఎత్తున పోరాటం చేసింది. ప్రభుత్వ అవినీతిని ఎండగట్టింది. విభజన హామీలను అమలు చేయాలని పోరాడింది.
తెలుగు దేశం ఆకర్ష్ పథకంలో భాగంగా వైయస్సార్ పార్టీ 24 మంది ఎమ్మెల్యేలు జంప్ జిలానీ లయ్యారు. తెలంగాణాలో నూ అదే జరిగింది. తెలుగు దేశం నుంచి వైఎస్సార్ సీపీ లోకి వచ్చిన చాంద్బాషా వైయస్సార్ పార్టీ తరపున నిలబడి గెలిచిన తరువాత తిరిగి తన పాత పార్టీ టీడీపీలోకి జంప్ చేశాడు. ప్రజారాజ్యం నుంచి డాక్టర్ సిద్దారెడ్డి వైఎస్ ఆర్ పార్టీ లోకి వచ్చారు.
రాజకీయాలలో విలువలకు వలువలు తీసేయడం సహజమైపోయింది. ప్రజలు కూడా దీన్ని తెలివైన పనిగా భావించడం ఒక విషాదం. దాంతో చాలా మంది రాజకీయ నాయకులు తమ అక్రమ సంపాదనకు రాజకీయాలను ఒక మార్గం గా ఎంచుకుంటున్నారు. గొర్రెల్ను తినువాడు పోయి బర్రెల్ను తినేవారు రావడం సహజమైపోయింది.
విలువలతో కూడిన రాజకీయాలు తాను చేస్తున్నానని, విశ్వసనీయతే తన ధ్యేయమని చెపుతూ ప్రజాసంకల్ప పాదయాత్ర ప్రారంభించాడు జగన్. మీద మీద పడిన ఎదురు దెబ్బలు కాచుకుంటూ పార్టీని బలోపేతం చేసుకున్నాడు. జగన్ అనుకుంటే మాట తప్పడు,మడమ తిప్పడు అన్న నమ్మకాన్ని ప్రజలే కి తీసుకెళ్లగలిగాడు . రావాలి జగన్ కావాలి జగన్ సిఎం అన్న స్లోగన్ ప్రజల నోళ్లలో బాగా నానింది.
వైకాపా మ్యానిఫెస్టోను 2019 ఏప్రిల్ 6 ఉగాది నాడు ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి విడుదల చేసాడు.జనాకర్షక పథకాలలో కొన్ని:రైతులకు రూ.12,500 చొప్పున నాలుగు దఫాలుగా రూ.50వేలురైతులకు,కౌలు రైతులతో సహా వడ్డీలేని రుణాలురైతులకు పగటిపూట 9గంటల ఉచిత విద్యుత్రైతుల కోసం రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిఆక్వా రైతులకు యూనిట్ రూపాయికే విద్యుత్రైతు కుటుంబాలకు రూ.7లక్షలతో బీమాఆరోగ్యశ్రీ పరిధిలోకి అన్ని వ్యాధులు. ఖర్చు రూ. వెయ్యి దాటితే చాలు ఆరోగ్య శ్రీ పరిధిలోకికిడ్నీ సహా ధీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెలకు రూ.10వేలు పింఛన్వృద్ధాప్య పింఛన్ రూ.3వేలకు పెంపు, పింఛన్ అర్హత వయసు 65 నుంచి 60కు తగ్గింపుమూడు దశల్లో మద్యపాన నిషేధంఖాళీగా ఉన్న రెండు లక్షల 30వేల ఉద్యోగాలు భర్తీప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించడంతో పాటుగా ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయులు నియామకాలు అతి స్వల్ప కాలంలో భర్తీ.
2019లో కదిరిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కదిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ పెడబల్లి వెంకట సిద్దారెడ్డిని వైఎస్సార్సీపీ ఆ పార్టీ జిల్లా ఇంచార్జి శ్రీ మిథున్ రెడ్డి ప్రకటించారు.
2019 ఎన్నికల్లో కేవలం ఆంధ్రప్రదేశ్ పై దృష్టిపెట్టి, ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 151 స్థానాలతో, లోకసభలో 22 స్థానాలతో ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. పార్లమెంట్ లో అత్యధిక ఎంపీలతో మూడో పెద్దపార్టీగా అవతరించింది. కదిరిలో డాక్టర్ పి వి సిద్ధారెడ్డి వైయస్సార్ పార్టీ ఎమ్మెల్యేగా కందికుంట ప్రసాద్ పై గెలుపొందారు
సత్యసాయి జిల్లా ఏర్పడి అందులో కదిరి రెవెన్యూ డివిజన్ గా కొనసాగింది. ఎన్నో ఏళ్లుగా ప్రజలు ఎదురు చూస్తున్న బైపాస్ రోడ్డు పనులు చురుగ్గా సాగుతున్నాయి. మారుమూల గ్రామాలకు రోడ్లు వేశారు. కదిరిలో వేమారెడ్డి కూడలి నుండి రాయలసీమ సర్కిల్ వరకు ఫోర్ లైన్ రోడ్డు నిర్మించారు.
హంద్రీనీవా ద్వారా నియోజకవర్గంలోని చెరువులను నింపినారు. రాయచోటి- కదిరి మధ్య డబుల్ లైన్ రోడ్డు నిర్మాణ పనులు సాగుతున్నాయి. కదిరిలో ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి , ప్రతి మండలంలో పీహెచ్సీలను, కదిరిలో పక్కా భవనాలతో అర్బన్ హెల్త్ సెంటర్లను నిర్మిస్తున్నారు. కదిరి డిగ్రీ కళాశాలలో పిజి సెంటర్ ఏర్పాటు చేశారు. మైనార్టీ విద్యా సంస్థలకు ప్రభుత్వ భవనాలు నిర్మిస్తున్నారు. చలపతి నాయుని సత్రం స్థానంలో భక్తులకోసం అధునాతన వసతులతో గదులు నిర్మించారు.
రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ పాలసీలో భాగంగా ప్రతి 2000 మందికి ఒక సచివాలయాన్ని నిర్మించారు. అందులో యువతకు పర్మనెంట్ ఉద్యోగాలిచ్చారు. . అమ్మ ఒడి పథకం కింద 15000 మొత్తాన్ని అకౌంట్లో జమ చేశారు. ప్రతి సచివాలయం పరిధిలో ఒక వాలంటీర్ను నియమించారు . ఈ వాలంటీర్ కు 5000 రూపాయలు గౌరవ వేతనం ఇస్తున్నారు. ఇంటికే పింఛన్లు ఇవ్వడంతో వృద్దులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నాడునేడు ద్వారా స్కూళ్లు, ఆసుపత్రుల అభివృద్ధి చేపట్టింది. దేశంలోనే తొలిసారిగా రివర్స్ టెండరింగ్ విధానం చేపట్టింది. ఒకే చోట అభివృద్ధి కేంద్రీకరించకుండా మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని చెప్పింది. ఇది ప్రాంతీయ వాదాన్ని రెచ్చగొడుతోందన్న విమర్శకు గురైంది. ఇది అధికార వికేంద్రీకరణకు దారి తీస్తుందని అభిప్రాయం కూడా కొంతమందిలో ఉంది.
పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ చేసింది. పోలీసులకు వీక్లీఆఫ్, సచివాలయాలకు వాలంటీర్లు, ఇంగ్లీష్ మీడియం, దిశ యాక్ట్, 50% నామినేటెడ్ పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళలకు ఇవ్వడం, 75% ఉద్యోగాలు స్థానికులకు లాంటి సంచలనాత్మక నిర్ణయాలు చేపట్టింది. చుక్కలభూములకు విముక్తి కల్పించింది. కానీ అది ఇంకనూ అమలు కాలేదు. పట్టణాలలో ఆరోగ్య కేంద్రాలను పట్టణ పేదలకు నిర్మించింది. రైతు భరోసా పథకం కింద 6500 రైతుల అకౌంట్లో వేసింది. జిల్లాల పునర్విభజన చేసింది. మతసామరస్యానికి పెద్ద పీట వేసింది. ప్రత్యేక హోదా విషయంలో ఏమీ సాధించలేక పోయింది. ప్రజా ఉద్యమాలపై ఉక్కు పాదం మోపింది. ప్రజాస్వామిక హక్కులను కాలరాచింది. 30 ఆక్ట్ ను నిరంతరం అమలు చేసింది.
____పిళ్లా కుమారస్వామి,9490122229

Comments
Post a Comment