ప్రజలు కూటమికి పట్టం కట్టారు.
ప్రజలు కూటమికి పట్టం కట్టారు.
ఇప్పుడు కూటముందున్న ప్రధాన కర్తవ్యం ప్రత్యేక హోదా తీసుకురావడం ప్రత్యేక హోదా అన్నది ఆంధ్రప్రదేశ్ ప్రజల ఒక సెంటిమెంట్ వ్యవహారానికి సంబంధించింది. కూటమిలో ప్రధాన భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ పార్టీ చాలాసార్లు ఆంధ్ర ప్రదేశ్ ప్రత్యేక హోదా తప్పనిసరిగా రావాలని డిమాండ్ చేశాడు. ఇప్పుడు ఆ ప్రత్యేక హోదా తెచ్చుకునే బాధ్యత దానిపైన ఎక్కువగా ఉంది.
కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చే విషయంలో కూడా జనసేన ది ప్రధాన బాధ్యత అవుతుంది రాష్ట్రానికి ప్రత్యేక హోదా అలాగే నిధులు జనసేన తీసుకొచ్చే అంశం మీద దాని ప్రగతి ఆధారపడి ఉంటుంది రాష్ట్రానికి ప్రత్యేక హోదా కేంద్రం ఇవ్వకపోతే ఏం చేస్తాడు అన్నది ఆయనకు సవాల్ గా ఉందిప్పుడు.
21 మంది గెలవడంతో సంఖ్యాపరంగా ఆయన బలగం బాగుంది అయితే చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన ఆరు హామీలను అమలు చేయలేని పక్షంలో ఆయన ఏ మేరకు ఆ పార్టీతో కలిసి ఉంటాడు అన్నది ఓ ప్రశ్న.
ఉప ముఖ్యమంత్రి పదవిగా తీసుకున్నప్పటికీ ఆయన పంచాయతీ రాజ్ ను చూస్తానని కూడా తీసుకున్నాడు అంటే గ్రామీణ ప్రాంతాలలో పంచాయతీలను బలోపే చేయాలి అవసరం ఉందన్న మాట అదే సందర్భంలో తన పార్టీని కూడా గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయాలని బహుశా ప్రయత్నం చేసి ఉండొచ్చు ఆలోచించి ఉండొచ్చు అందువల్ల ఆయన పంచాయతీరాజ్ శాఖ తీసుకొని ఉండొచ్చు.
జగన్ సిపిఎస్ ను రద్దుచేసి ఓల్డ్ పెన్షన్ విధానాన్ని ఉద్యోగులకు ఇస్తానని మాట ఇచ్చి మడం తిప్పి వారికి ఆ హామీని అమలు చేయలేదు. పవన్ కళ్యాణ్ ఉద్యోగస్తులకు ఓల్డ్ పెన్షన్ విధానం ఉండాలని పలుమార్లు ప్రకటించాడు.
పవన్ కళ్యాణ్ తాను ఇచ్చిన మాట మరి ఇప్పుడు నిలబెట్టుకుంటాడా చూడాలి.
అవినీతిపై రాజీలేని పోరాటం చేస్తానని చెప్పాడు పవన్ కళ్యాణ్. చేగువేరా తనకు ఆదర్శమని గతంలో ఎన్నోసార్లు చెప్పుకున్నాడు పవన్ కళ్యాణ్. అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలని ఎన్నోసార్లు పిలుపునిచ్చాడు. తాను కోట్ల సంపాదన వదిలుకొని ప్రజల కోసం పనిచేయడానికి వచ్చానని కూడా చెప్పుకున్నాడు. వందల కోట్లు ఖర్చుపెట్టిన ఎమ్మెల్యేలు అవి రాబట్టుకోవడానికి అవినీతికి పాల్పడకుండా ఉంటారా? ప్రభుత్వ శాఖల్లో విచ్చలవిడిగా బహిరంగంగా పెరిగిన అవినీతిని పవన్ కళ్యాణ్ అరికట్టగలుగుతాడా అన్నది వేచి చూడాలి.
గతంలో జగన్ ప్రభుత్వం ఉద్యోగస్తులకు సకాలంలో జీతాలు చెల్లించకపోవడం వల్ల వారి అసంతృప్తికి ఆగ్రహానికి గురయ్యారు. నేడు బాబు ప్రభుత్వం కూడా సకాలంలో చెల్లిస్తుందా లేదా చూడాలి. చెల్లించకలేకపోతే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ తీసుకొనే చర్యలు ఏమి అనేది భవిష్యత్తులో చూడాలి.
జగన్ ప్రభుత్వం పై వ్యతిరేకతలో నిరుద్యోగ యువత పాత్ర అధికంగా ఉంది. కారణం ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగిత రేటు పెరగడమే. దాదాపు నూటికి 25 మంది నిరుద్యోగులుగా ఉన్నారు. మీరందరికీ ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానని హామీ ఇచ్చిన జగన్, అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం సచివాలయ ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు. అడపాదడపా కొన్ని ఉద్యోగాలు ప్రకటించినా అవి యువతను ఏ మాత్రం ఆకర్షించలేకపోయాయి. పైగా ఎలాంటి ప్రైవేట్ రంగంలో ఎటువంటి ఫ్యాక్టరీలు పెద్దగా రాకపోవడం వల్ల నిరుద్యోగ యువతకు ఉపాధి మార్గం దొరకడం లేదు. ఈ అసంతృప్తి మొత్తం కూటమి వైపు మల్లేటట్లు చేసింది. అందులో యువతలో ఎక్కువ భాగం జనసేన వైపు ఉన్నారు. వారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పైన అభిమానంతోను చంద్రబాబు ఏదైనా చేస్తాడు అన్న ఆశతోను కూటమిని గెలిపించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆ యువతకు తగిన ఉపాధిని కల్పించాల్సిన బాధ్యత ఏర్పడింది. చంద్రబాబు కన్నా పవన్ కళ్యాణ్ పైనే ఎక్కువ ఉంది. ఎందుకంటే అది ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న పార్టీ కనుక. దీన్ని నిలబెట్టుకోవాలంటే ఆ యువతను జనసేన వైపు ఆకర్షించుకోవడానికి తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలి. అందుకోసం పవన్ కళ్యాణ్ యువతకు పెద్దపీట వేస్తూ వారి ఉపాధి కోసం చేసే కృషి మీద దాని భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది లేకపోతే మళ్లీ వైఎస్ఆర్ పార్టీకి పట్టిన గతే ఎదురవుతుందనేది ని సందేహం.
Comments
Post a Comment